ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMBATI RAMBABU : 'భాజపా నేతలు టెర్రరిస్టులా..? అసాంఘిక శక్తులా..?' - jinna tower

జిన్నా టవర్​ను కూలుస్తామంటూ భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. భాజపా నేతలు జాతికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తోందని, దీనిని అరికట్టడం కష్టతరమవుతోందని అంబటి రాంబాబు అన్నారు.

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

By

Published : Dec 31, 2021, 10:00 PM IST

గుంటూరులోని జిన్నా టవర్​ను కూల్చుతామన్న భాజపా నేతలు... జాతికి క్షమాపణలు చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. భాజపా నేతలు టెర్రరిస్టులా..? అసాంఘిక శక్తులా? అని వ్యాఖ్యానించారు. జిన్నా, గాంధీ ఇద్దరూ స్వాతంత్య్రం కోసం, మత సామరస్యం కోసం పోరాడారని, భాజపా నేతలు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్నా దేశ భక్తుడని భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వానీ ప్రశంసించారని, దీనిపై భాజపా నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

వంగవీటి రాధా రెక్కీ వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సమస్య సృష్టించాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా విపరీతంగా పెరిగిందని, మద్యం అక్రమ రవాణాను అరికట్టడం కష్టతరమవుతోందన్నారు. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడం సహా బ్రాండ్లనూ అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details