సామాజికవర్గాల సమీకరణ వల్లే కొందరికి ఎమ్మెల్సీ స్థానాలు(sajjala ramakrishna reddy on mlc candidates) దక్కలేదని.. అలాంటి వాళ్లు నిరాశకు గురి కావద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని.. ఇదో సామాజిక విప్లవం అని సజ్జల(sajjala on mlc candidates) అభిప్రాయపడ్డారు. కేటాయించిన సీట్లు కూడా గెలిచేవి ఇస్తున్నామని.. ఇతర పార్టీల వలే ఓడిపోయే సీట్లను ఇవ్వడం లేదని విమర్శించారు.
గుంటూరు కలెక్టరేట్‌లో స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు.. నామపత్రాలను జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్కు(nominated as MLC candidates at guntur) సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.