WOMENS DAY CELEBRATIONS AT GUNTUR: నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్న మహిళలు ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి మానసిక వత్తిడి నుండి ఉపశమనం పొందాలని.. అప్పుడే జీవితాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారని సాయి భాస్కర్ హాస్పిటల్ నిర్వాహకురాలు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి అన్నారు. గుంటూరు ఈఫీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె మహిళలకు అవగాహన కల్పించారు.
గుంటూరు ఈఫీఎఫ్ ఆఫీస్లో మహిళా దినోత్సవ వేడుకలు - గుంటూరు ఈఫీఎఫ్ ఆఫీస్లో మహిళా దినోత్సవం
WOMENS DAY: గుంటూరు ఈఫీఎఫ్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి మహిళలకు అవగాహన కల్పించారు.
మహిళా దినోత్సవం
మహిళలు ఎదుర్కొంటున్నా సమస్యలు, మానసిక ఒత్తిడి పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మానసిక ఉల్లాసంగా కోసం ప్రతిరోజు గంట సమయాన్ని కేటాయించి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్, మహిళా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: