మహిళపై వైకాపా కార్యకర్త అత్యాచారానికి యత్నించాడని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా ఈపూరు పోలీస్స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. నిందితుడిని శిక్షించాలని పీఎస్ ఎదుట బైఠాయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతుంటే.. తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారంటూ మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మహిళల ఆందోళనతో కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. వినుకొండ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్థుల రాస్తారోకో నిర్వహించారు.