CM Relief Fund: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మండల, జిల్లా స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. 2020లో ద్విచక్రవాహనంపై భర్తతో కలిసి పొలానికి వెళ్తుండగా వేరే వాహనం ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఆమె కాలు మూడు చోట్ల విరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో రూ.6లక్షలు అప్పు చేసి ప్రైవేటుగా వైద్యం చేయించుకున్నారు. అనంతరం ఇన్ఫెక్షన్ సోకడంతో కాలు తీసేశారు.
CM Relief Fund: నాడు మహిళా ఆదర్శ రైతు.. నేడు సీఎంఆర్‌ఎఫ్ సాయం కోసం పాట్లు - గుంటూరు జిల్లా స్పందన కార్యక్రమం
CM Relief Fund: ప్రకృతి వ్యవసాయం చేస్తూ మండల, జిల్లా స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకున్న కోటేశ్వరమ్మ అనే మహిళ సీఎంఆర్‌ఎఫ్, వికలాంగ పింఛను మంజూరు చేయాలని ఇటీవల గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన ‘స్పందన’లో అధికారులకు వినతిపత్రం అందించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద ఆర్థిక సాయం చేయాలని స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు బిల్లులు అందించారు. బిల్లులు 3 నెలల్లోపే ఇవ్వాలని, ఆలస్యమైందని అధికారులు చెప్పారు. ప్రజాప్రతినిధుల ద్వారా అమరావతి సచివాలయంలో అధికారులకు బిల్లులిచ్చారు. సంవత్సరమైనా ఆర్థిక సాయం అందలేదు. సీఎంఆర్‌ఎఫ్ సాయం, వికలాంగ పింఛను మంజూరు చేయాలని ఇటీవల గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన ‘స్పందన’లో అధికారులకు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: TDP @ 40: పడి లేచే కెరటం తెదేపా.. 40ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు