గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కిలో స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి రక్షించాలంటూ హిమామ్ బీ అనే మహిళ అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. నూతక్కికి చెందిన అధికార పార్టీ నాయకులు శివారెడ్డి దగ్గర గతంలో రూ.5 రూపాయల వడ్డీ కింద రూ.50 వేలు తీసుకున్నానని....ఆ డబ్బులు మొత్తం చెల్లించినా ఇప్పుడు ఇంకా బాకీ ఉందంటూ తనను నిత్యం వేధిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఇంటిని సైతం పొక్లైన్తో కూలగొట్టారని బాధితురాలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
వైకాపా నేత వేధిస్తున్నాడని ఎస్పీకి మహిళ ఫిర్యాదు! - వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని గుంటూరు మహిళ ఫిర్యాదు
గుంటూరు జిల్లా నూతక్కిలో స్థానిక వడ్డీ వ్యాపారి, వైకాపా నేత వేధిస్తున్నారని ఓ మహిళ అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో వడ్డీకి రుణం తీసుకుని తిరిగి చెల్లించానని.. ఇంకా నగదు చెల్లించాలని వేధిస్తున్నారని మహిళ ఆరోపించారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ...కేసును విచారించాలని డీఎస్పీని ఆదేశించారు.
వడ్డీ వ్యాపారి వేధింపులపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు
ఈ విషయంపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎస్పీ ముందుకు వచ్చానని హిమామ్ బీ తన గోడు వెల్లబోసుకుంది. ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ ఈ కేసును డీఎస్పీకి అప్పగించారు. బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :భూమి నుంచి భారీ శబ్దాలు...పరుగులు తీసిన జనం
Last Updated : Dec 1, 2020, 6:17 AM IST