ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం: హోం మంత్రి - AP Police Latest News

ఏపీ పోలీసు శాఖ, రాష్ట్ర పోలీసులు తమ పని తీరుతో జాతీయ స్థాయిలో పేరు, ప్రతిష్టలు పొందుతున్నారని.. రాష్ట్ర పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. పోలీసు స్టేషన్​కు వచ్చే బాధితులు చిరునవ్వుతో తిరిగి వెళ్లాలని, పారదర్శకంగా పోలీసు సేవలు అందాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు హోంమంత్రి సుచరిత చెప్పారు.

పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం
పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం

By

Published : Mar 23, 2021, 5:33 PM IST

పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం...

వైకాపా ప్రభుత్వం వచ్చాక పోలీసు శాఖ పనితీరు మెరుగు పడిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. పునర్నిర్మించిన గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. గుంటూరు జిల్లా గ్రామీణ పరిధిలో 64 పోలీసుస్టేషన్లను నాడు-నేడు కింద ఆధునీకరించామని చెప్పారు. ఒకప్పుడు ఠాణాలు భూత్ బంగ్లా మాదిరిగా ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చినట్లు హోంమంత్రి వివరించారు.

ఏపీ పోలీసు సేవలకు జాతీయస్థాయిలో 125 అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సమర్ధత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పోలీసులు ముందడుగు వేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సిబ్బందికి సూచించారు. ఈ అవార్డులు తాము మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని చెప్పారు. ప్రజలు పోలీసుల నుంచి ఏమి అశిస్తున్నారో.. అవి నెరవేర్చడానికి ఎప్పూడు సిద్ధంగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల సమయంలో పోలీసుల పనితీరును డీజీపీ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details