ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిపై చర్చించేందుకు సీఎం అపాయింట్​మెంట్ కోరాం'

రాజధానిపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పేందుకు ఈ నెల 5న ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కోరామని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు మస్తాన్ వలి తెలిపారు. తమ ఆలోచనను పరిగణలోకి తీసుకుంటే మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుంటారని అభిప్రాయపడ్డారు.

apcc working president mastan vali
apcc working president mastan vali

By

Published : Dec 3, 2020, 7:21 PM IST

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి ఈనెల 5న ఆయన అపాయింట్​మెంట్ కోరామని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు మస్తాన్ వలి తెలిపారు. అపాయింట్​మెంట్ ఇస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్​తో సహా సీఎం జగన్ కలుస్తామన్నారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అయన మాట్లాడారు.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' కాంగ్రెస్ పార్టీ నినాదమన్నారు. న్యాయ రాజధాని పేరుతో రాయలసీమ ప్రజలను.. కార్యనిర్వాహక రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను ప్రభుత్వం మోసగిస్తోందన్నారు. తమ ఆలోచనను సీఎం పరిగణలోకి తీసుకుంటే మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుంటారని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details