ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నగరంలో నేటి నుంచి నీటి సరఫరా: కమిషనర్ అనురాధ - గుంటూరు నగరానికి నీటి సరఫరా

గుంటూరు నగరంలో నేటి నుంచి నీటి సరఫరా చేయనున్నట్లు మన్సిపల్ కమిషనర్ అనురాధ తెలిపారు. ప్రధాన పైపు లైన్ల అనుసంధానం, లీకులకు మరమ్మతుల నిర్వహణకు రెండ్రోజుల పాటు సరఫరాను నిలిపివేశారు.

water-supply-in-guntur-city-from-today
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-September-2020/8771542_1001_8771542_1599903908317.png

By

Published : Sep 12, 2020, 9:56 AM IST

Updated : Sep 12, 2020, 3:16 PM IST

గుంటూరు నగరంలోని ప్రధాన పైపులైన్ల అనుసంధానం, లీకులకు మరమ్మతుల నిర్వహణకు రెండ్రోజుల పాటు సరఫరాను నిలిపివేశారు. లీకుల మరమ్మతుల అనంతరం శనివారం ఉదయం నుంచి నగరంలో తాగునీటి సరఫరా పాక్షికంగా ఉంటుందని, సాయంత్రానికి పూర్తిస్థాయిలో పాతపద్ధతిలోనే నీటి సరఫరా చేయనున్నట్లు నగర కమిషనర్‌ అనురాధ ప్రకటించారు.

నెహ్రూనగర్‌ రిజర్వాయర్లో ఏపీఎండీపీ ప్యాకేజీ-1లో నూతనంగా నిర్మించిన 2200 కె.ఎల్‌.సంప్‌ కమ్‌ పంప్‌ హౌస్‌ని ట్రయల్‌ రన్‌ చేయడానికి నూతన సంప్‌నకు 1200 ఎం.ఎం డయా పీఎస్‌సీ పంపింగ్‌ లైన్‌తో అనుసంధానం చేశామన్నారు.

Last Updated : Sep 12, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details