కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి గుంటూరు నగరం అమరావతి రోడ్డులోని సరస్వతి కాలనీ వద్ద మురుగునీరు వచ్చి చేరింది. దీని వల్ల దుర్వాసన, దోమలు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లేని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాలనీలోకి మురుగునీరు... ఆందోళనలో స్థానికులు - water stagnation problems in guntur
గుంటూరు నగరం అమరావతి రోడ్డు సరస్వతి కాలనీలో మురుగు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సరస్వతి కాలనీలో చేరిన మురుగునీరు