ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Water problem in Dachepalli: నగర పంచాయతీగా మారినా... పరిస్థితి మారలేదు - గుంటూరులో మొదలైన నీటి సమస్యలు

Water problem in Dachepalli: వేసవి ఆరంభంలోనే పల్నాడులో కొన్నిచోట్ల నీటి ఎద్దడి మొదలైంది. దాచేపల్లి, నడికుడి శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన జనాభాకు తగ్గట్లు పైపులైను విస్తరణకు నోచుకోకపోవడంతో.. గుక్కెడు నీటి కోసం ప్రజలు యాతన పడుతున్నారు.

Water problem in Dachepalli
దాచేపల్లిలో నీటి ఎద్దడి

By

Published : Mar 21, 2022, 6:05 PM IST

దాచేపల్లిలో నీటి ఎద్దడి

Water problem in Dachepalli: గుంటూరు జిల్లా దాచేపల్లి - నడికుడి పంచాయతీ.. గత ఏడాది నగర పంచాయతీగా స్థాయికి ఎదిగింది. జనాభా 40వేలకు చేరింది. పెరిగిన జనాభాకు తగ్గట్లు తాగునీరు మాత్రం అందడం లేదు. సుమారుగా 40 శాతం జానాభాకు సరిపడా తాగునీరు లభ్యం కావడం లేదు. వేసవి వచ్చిందంటే చాలు.. దాచేపల్లి, నడికుడి ప్రజల పాట్లు వర్ణనాతీతం. దుర్గాభవానీ కాలనీ, ఎస్టీ కాలనీ, నడికుడి ఎస్సీ కాలనీ, అంజనీపురంలో ప్రజలు ఏటా నీటిఎద్దడితో అల్లాడిపోతున్నారు. ట్యాంకర్ల ద్వారా అప్పుడప్పుడూ వచ్చే నీళ్లే వీరికి అధారం. సరైన సమయానికి ట్యాంకర్లు రాకపోతే.. మంచినీటి క్యాన్లు తెచ్చుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

"మోటర్​ చెడిపోయి 15 రోజులవుతోంది. ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా నెలకోసారి జరుగుతూనే ఉంటుంది. మోటర్​ కాలిపోతే వేయడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ట్యాంకర్లు పంపించాలని అడిగినా పట్టించుకోరు. కిలో మీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎవ్వరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు."- గ్రామస్థులు

Water problem in Dachepalli: శివారు కాలనీలకు పైపులైను విస్తరించకపోవడంతో.. దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కిలోమీటర్ దూరం నుంచి ట్రాక్టర్లపై డ్రమ్ముల్లో తెచ్చుకుని నిల్వ ఉంచుకుంటున్నామని చెబుతున్నారు. ఎప్పుడైనా ట్యాంకర్ వచ్చినప్పుడు నీళ్లు పట్టుకుంటామని.. దాని కోసమే ఎదురుచూడాలంటే ఉపాధి పోతుందని ఆవేదన చెందుతున్నారు. కొందరైతే డ్రమ్ములు పెట్టేసి పనులకు వెళితే.. ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటిలో నింపుతున్నారు.

"మున్సిపాలిటీగా మారగానే ప్రతి ఇంటి వద్ద పంపులు పెడతామన్నారు. ఓట్లు వేయించుకున్నారు. వెళ్లిపోయారు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు ఏదీ లేదు. ఇబ్బందులు పడుతున్నాం. పాడి పశువులకు నీళ్లు కావాలని.. పొలానికి కూడా వెళ్లకుండా నీటి కోసం ఇంట్లో ఉండి పడిగాపులు కాస్తున్నాం."- మహిళలు

Water problem in Dachepalli: దాచేపల్లి-నడికుడి తాగునీటి సమస్యలపై అధికారులు స్పందించాలని.... శివారు కాలనీలకు తగిన సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పైపులైను విస్తరిస్తే సమస్య చాలావలకు తీరుతుందని అంటున్నారు.

ఇదీ చదవండి:ఆ దృష్టి మళ్లించేందుకే.. పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు: తెదేపా

ABOUT THE AUTHOR

...view details