గుంటూరు జిల్లా దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో బాక్సులను పిల్లలతో మోయించడం కలకలం రేపింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు తెచ్చిన అనంతరం ఖాళీ బాక్సులను ప్రధానోపాధ్యాయులు.. పోలీస్ స్టేషన్లో పెట్టాలని కాపలాదురుడికి చెప్పి వెళ్లిపోయారు. ఆ వాచ్మెన్ శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఆటలాడుకుంటున్న కొంతమంది పిల్లలను పిలిచి... వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టమని చెప్పాడు. పిల్లలు బాక్సులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టారు. బాలల హక్కులు కాపాడాల్సిన పోలీసులు ఈ దృశ్యాలను చూస్తూ ఏమీ అనకపోవడం మరో ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ఘటనపై స్పందించిన ఏంఈవో కాజా శ్రీనివాసరావు.. పిల్లలతో పెట్టమని చెప్పలేదని ఆ పనిని కాపలాదారుడికి చెప్పామని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు సైతం వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని.. విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు.