Vijayasai reddy on alliance : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మరింత ఎక్కువగా ఓట్లు, సీట్లు గెలుస్తామని చెప్పారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన విజయ సాయిరెడ్డి ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటున్నారని ఆక్షేపించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరన్నారు. మరో 20, 25 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని.. ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలకు సంబంధించి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని... అవన్నీ తెదేపా నాయకులు చేసినవేనని....తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కార్యకర్తలపై బురద జల్లుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి.... :విజయసాయి రెడ్డి - Vijayasai reddy on pothulu
Vijayasai reddy on alliance : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు.
Vijayasai reddy