ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే నుంచి శ్రీవారి భక్తునికి 'సువార్త' పుస్తకం! - శ్రీవారి భక్తుడికి సువార్త పుస్తకం వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించే ఆధ్యాత్మిక పత్రిక సప్తగిరితో పాటు అన్యమత ప్రచారానికి సంబంధించిన పుస్తకం శ్రీవారి భక్తునికి రావటం వివాదాస్పదమైంది. హిందూ మతాన్ని పరిరక్షించాల్సిన తితిదే నుంచి వేరే మతానికి సంబంధించిన పుస్తకం వచ్చేసరికి ఆ భక్తుడు విస్తుపోయాడు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర భక్తులూ డిమాండ్ చేస్తున్నారు.

venkateswara swamy devotee get suvartha book in a post sent by ttd
venkateswara swamy devotee get suvartha book in a post sent by ttd

By

Published : Jul 6, 2020, 7:56 PM IST

మీడియాతో రాఘవరావు బంధువు విష్ణు

తితిదే సప్తగిరి మాసపత్రిక నిర్వాహకులు మరో వివాదంలో చిక్కుకున్నారు. సప్తగిరి మాస పత్రికతో పాటు అన్యమత పుస్తకాన్నీ పోస్టులో తమకు పంపారని గుంటూరుకు చెందిన ఓ భక్తుడు వెల్లడించారు. నగరంలోని మల్లిఖార్జునపేటకు చెందిన రాఘవరావు.. సప్తగిరి మాసపత్రిక చందాదారు. జులై నెలకు సంబంధించిన పత్రిక సోమవారం ఉదయం వచ్చింది. అతని ఇంటి గేటు వద్ద పోస్టుమేన్ దానిని పెట్టి వెళ్లారు. కవరు తెరచి చూడగా సప్తగిరి మాసపత్రికతో పాటు అన్యమతానికి చెందిన సజీవ సువార్త అనే మరో బుక్ లెట్ వచ్చిందని రాఘవరావు బంధువు విష్ణు తెలిపారు.

తాము పవిత్రంగా పూజించే వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల నుంచి ఇలాంటి పుస్తకం రావటం ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. ఈ వ్యవహారంపై తితిదే విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ విచారణ చేయించాలని రాఘవరావు కుటుంబీకులు డిమాండ్ చేశారు.

అయితే... సజీవ సువార్త పుస్తకంపై మహిళ పేరుతో చిరునామా ముద్రించి ఉంది. కానీ తితిదేకు సంబంధించిన కవర్లో సప్తగిరి మాసపత్రికతో పాటు ఆ పుస్తకం ఎలా జత కలిసిందన్నదే ఇక్కడ అర్థం కాని పరిస్థితి. పోస్టల్ శాఖ వాళ్ల పొరపాటు ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదైనా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సప్తగిరి మాసపత్రిక వివాదం: ఇద్దరు ఉద్యోగులపై వేటు

ABOUT THE AUTHOR

...view details