ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ సుజనాచౌదరితో వల్లభనేని వంశీ భేటీ - గుంటూరులో వంశీ, సుజనా భేటీ

తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భాజపా ఎంపీ సుజనాచౌదరిని కలవటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీ పార్టీ మారతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.

వల్లభనేని

By

Published : Oct 25, 2019, 11:28 AM IST

ఎంపీ సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుంటూరులో భాజపా ఎంపీ సుజనాచౌదరిని కలిశారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులో భాజపా నేత చందు సాంబశివరావు ఇంటికి వచ్చిన సుజనా... కాసేపు మీడియాతో మాట్లాడారు. అంతవరకు వంశీ వేరేచోట సుజనాచౌదరి కోసం వేచి ఉన్నారు. ప్రెస్ మీట్ ముగియగానే ఇద్దరూ ఒకే కారులో బయలుదేరారు. ఇరువురి నేతల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... సుజనాను కలిసేందుకు గుంటూరు రావటంతో వంశీ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details