ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​కు 'యూరో డైనమిక్స్ స్టడీ మిషన్' పరికరం

గుంటూరు జీజీహెచ్​లో యూరో డైనమిక్స్ స్టడీ మిషన్​ను కొత్తగా ఏర్పాటు చేశారు. మూత్ర సంబంధిత వ్యాధుల నిర్ధరణ కోసం ఈ పరికరాన్ని రూ. 35 లక్షలతో ఏర్పాటు చేశారు.

guntur ggh
గుంటూరు జీజీహెచ్​కు 'యూరో డైనమిక్స్ స్టడీ మిషన్' పరికరం

By

Published : Nov 21, 2020, 7:46 PM IST

గుంటూరు జీజీహెచ్​లో మరో అధునాతన వైద్య పరికరం అందుబాటులోకి వచ్చింది. మూత్ర సంబంధిత వ్యాధుల నిర్ధరణ కోసం యూరాలజీ విభాగంలో 35 లక్షల రూపాయల వ్యయంతో 'యూరో డైనమిక్స్ స్టడీ మిషన్​'ను ఏర్పాటు చేశారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఈ వైద్య పరికరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

మూత్రాశయ సమస్యలు, ప్రొస్టేట్ గ్రంధి శస్త్రచికిత్సల సమయంలో ఈ పరికరం ద్వారా కచ్చితత్వంతో వ్యాధి నిర్ధరణ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి మిషన్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. దీంతో పేద ప్రజలు వేలకు వేలు పెట్టి బయట పరీక్షలు చేయించుకునే ఆర్ధికభారం తప్పుతుందని.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ ప్రభావతి కోరారు.

ABOUT THE AUTHOR

...view details