ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లి పిలుపునకు వచ్చి నగలు చోరీ - గుంటూరులో నగల చోరీ

పెళ్లి పిలుపు మాటున వచ్చి ఇళ్లు దోచేశారు. గుట్టుగా నగలు దోచేసి ఇంటికి చెక్కేశారు. ఈ ఘటన గుంటూరు వికాస్ నగర్ లో జరిగింది.

theft at guntur
theft at guntur

By

Published : May 11, 2021, 9:22 AM IST

పెళ్లి పిలుపునకు వచ్చి ఓ ఇంట్లోనే చోరీ చేసిన ఇద్దరు మహిళలను గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మనీషాకు గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాధాదేవి కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. దీంతో పలుసార్లు గుంటూరు వచ్చి వాళ్ల ఇంట్లో ఉండి వెళ్లేవాళ్లు. ఈక్రమంలో ఏప్రిల్‌ 29న మనీషా తన తల్లి ఝాన్సీతో కలిసి గుంటూరు వికాస్‌నగర్‌లోని రాధాదేవి ఇంటికి వచ్చారు. మనీషాకు వివాహం నిశ్చయమైందని పెళ్లికి పిలవడానికి వచ్చినట్లు తెలిపారు. రాత్రి పొద్దుపోవడంతో ఆరోజు ఆ ఇంట్లో ఉండి మరుసటిరోజు ఒంగోలు వెళ్లిపోయారు.

వాళ్లు వెళ్లిన తర్వాత ఇంట్లోని బీరువాలో చూస్తే బంగారపు వడ్డాణం, నక్లెస్‌, చెవిదిద్దులు, పట్టుచీర మొత్తం రూ.10 లక్షలు విలువచేసే వస్తువులు చోరీకి గురైనట్లు రాధాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ డీఎస్పీ సుప్రజ, పట్టాభిపురం సీఐ శివప్రసాద్‌లు కేసు నమోదు చేసి విచారించగా మనీషా, ఆమె తల్లి ఝాన్సీలు ఆ నగలు చోరీ చేసినట్లు తేలడంతో వారిని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేసి రూ.10 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు జప్తు చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ శివప్రసాద్‌, ఎస్‌ఐ సత్యన్నారాయణ, సిబ్బంది జానీ, సరస్వతీ, రమేష్‌బాబు, ఉమామహేష్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం

ABOUT THE AUTHOR

...view details