మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గుంటూరులో ఓ పార్టీ నేతలు కుక్కర్లను పంపిణీ చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ నరేష్ కుమార్ తెలిపారు. గుంటూరులో అన్నదాన సత్రం, రజకుల బజార్, రామాలయం వద్ద 18 రైస్ కుక్కర్లు పంపిణీ చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
గుంటూరులో ఓటర్లకు కుక్కర్లు పంపిణీ చేస్తున్ ఇద్దరు అరెస్టు - గుంటూరు నేటి వార్తలు
గుంటూరులో కుక్కర్లు పంపిణీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
గుంటూరులో ఓటర్లకు కుక్కర్లు పంపిణీ చేస్తున్న నేతలు