గుంటూరు శివారు గొల్లవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులోకి దిగి శుభ్రపరుస్తుండగా ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో ముందుగా లోనికి దిగిన వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో మరో వ్యక్తి మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మృతులు నల్లచెరువుకు చెందిన రాము (27), అత్తయ్య (33)గా పోలీసులు గుర్తించారు. దీనిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన సెప్టిక్ ట్యాంక్..ఊపిరాడక ఇద్దరు మృతి - guntur news
గుంటూరు నగరంలోని ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తూ ఇద్దరు మృత్యువాత పడ్డారు. నల్లపాడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఊపిరాడక ఇద్దరు మృతి