ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో అందుబాటులోకి మరో 2 కరోనా పరీక్షా కేంద్రాలు - కరోనా నిర్ధరణ కేంద్రాలు కడప

రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో మరో రెండు వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 4నుంచి కడప, గుంటూరులో వీఅర్డీఎల్ ల్యాబ్ లు పని చేస్తాయని వెల్లడించింది.

two new corona  testing labs
రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న మరో రెండు కరోనా పరీక్షా కేంద్రాలు

By

Published : Apr 2, 2020, 7:44 PM IST

రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న మరో రెండు కరోనా పరీక్షా కేంద్రాలు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 4 పరీక్షా కేంద్రాలకు అదనంగా... మరో రెండింటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గుంటూరు, కడపలో కొత్తగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు అయ్యాయని.. ఈ నెల 4నుంచి పూర్తిస్తాయిలో వీఅర్డీఎల్ ల్యాబ్ లు పని చేస్తాయని వెల్లడించింది. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ఆరు పరీక్షా కేంద్రాల ద్వారా 450 నుంచి 570 నమూనాలను ఒకేసారి పరీక్షించే వీలుంటుందని తెలియజేసింది.

విశాఖలో అదనంగా మరో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ -19 ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత భద్రతా దుస్తులు (పీపీఈ)లు తక్షణం అమర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. 4 రాష్ట్రస్థాయి కోవిడ్ -19 ఆస్పత్రులకు రోజుకు 2,500.. జిల్లా ఆస్పత్రులకు వెయ్యి చొప్పున పర్సనల్​ ప్రొటెక్షన్​ ఎక్విప్​మెంట్స్ సరఫరా అవసరమవుతుందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details