Murder case Accused Arrest : గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం జాకీర్ హుస్సేన్ వీధిలో ఈ నెల 15న రాత్రి దారి ఇవ్వలేదని వ్యక్తిపై దాడిచేసి కొట్టి చంపిన కేసులో నిందితులైన తండ్రీకొడుకులను గురువారం అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ రాజేశ్వర రావు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇస్మాయిల్ (35)ను హారన్ కొడుతున్నా దారి ఇవ్వలేదని.. వెనుకనే మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న తండ్రీ కొడుకులు షేక్ బాజీ, మాలిక్‌లు ఆగ్రహించి ఇస్మాయిల్‌పై దాడి చేసి కొట్టడంతో అతను మృతి చెందాడు. రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
Arrest: హారన్ కొట్టినా దారివ్వలేదని వ్యక్తి హత్య.. ఇద్దరు అరెస్ట్ - Murder case Accused Arrest Chilakaluripet
మనుషులకు సహనం నశించిపోతోంది... చిన్నపాటి సమస్యను భూతద్ధంలో చూస్తూ చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. క్షణికావేశంలో చేస్తున్న ఇలాంటి తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన పెద్దలు సైతం ఇలాంటి ఘటనలకు పాల్పడటం దారుణం.
దారివ్వలేదని వక్తిని హత్య చేసిన ఘటనలో ఇద్దరి అరెస్ట్...
Last Updated : Feb 18, 2022, 2:20 PM IST