కరోనా కట్టడికి మండలాల వారీగా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ చెప్పారు. జిల్లాలో 12 మండలాలను రెడ్ జోన్లుగా, 6 ఆరెంజ్ జోన్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. మిగతా మండలాలను గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలు నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్ద పోలీసులు నిలిపేసి విధులకు ఆలస్యమైతే ఉద్యోగులే బాధ్యత వహించాలని అన్నారు. రెడ్ జోన్ మున్సిపాల్టీల్లో పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో మండలాల మధ్య రాకపోకలు నిషేధం
గుంటూరు జిల్లాలో మండలాల మధ్య రాకపోకలను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ప్రకటించారు.
Gnt_Collector on Redzone