పల్నాడు జిల్లా గురజాలలోని.. ఓ మదర్సాలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేశాక మున్నా అనే బాలుడు మృతిచెందాడు. మదర్సాలో ఉండే విద్యార్థులకు.. వేర్వేరు ప్రాంతాల నుంచి దాతలు ఆహారం అందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ శుభకార్యం నుంచి మదర్సాకు.. ఇవాళ ఆహారం వచ్చింది. అది తిన్న తర్వాత 11మంది విద్యార్థులు.. అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో మున్నా అనే బాలుడు మరణించగా.. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని... పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు తిన్న ఆహారాన్ని పరీక్షల కోసం పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.
గురజాలలోని మదర్సాలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి - Student dies after eating poisoned food
కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి
14:04 July 16
కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి
Last Updated : Jul 16, 2022, 3:13 PM IST