ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు, ఎల్లుండి గుంటూరులో ట్రాఫిక్​ ఆంక్షలు.. - ycp plenary arrangements in guntur

Traffic Diversions over YCP Plenary: వైకాపా ప్లీనరీ దృష్ట్యా ఈనెల 8, 9 తేదీల్లో 16వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్​ అంక్షలు విధించారు. ఈ రెండు రోజులు జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Traffic Diversions over YCP Plenary at guntur
Traffic Diversions over YCP Plenary at guntur

By

Published : Jul 7, 2022, 6:15 PM IST

Traffic restrictions in Guntur: వైకాపా ప్లీనరీ దృష్ట్యా ఈనెల రేపు, ఎల్లుండి 16వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తెలిపారు. ప్లీనరీ జరిగే మార్గంలో జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి దారిమళ్లిస్తారు. చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుందన్నారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు మీదుగా.. తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్ జంక్షన్ మీదుగా మల్లించారు.

విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచే దారి మళ్లించి గుడివాడ మీదుగా.. అవనిగడ్డ, రేపల్లె, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లేలా చర్యలు చేపట్టారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు మీదుగా.. ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనములు ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లించుకుని హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలని సూచించారు.

చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు చిలకలూరి పేట, ఒంగోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపివేస్తారు. విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఆపివేస్తారు. రాత్రి 10 గంటల తర్వాతే భారీ వాహనాలను జాతీయ రహదారిపైకి అనుమతిస్తారు.

YCP Plenary Parking Arrangements: ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులు కాజా టోల్ ప్లాజా వద్ధ రామకృష్ణ వెనూజియాలో.. కార్లు, ద్విచక్ర వాహనాలకు నాగార్జున యూనివర్శిటిలో పార్కింగ్ వసతి కేటాయించారు. గుంటూరు నుంచి వచ్చే బస్సుల్ని నంబూరు, కంతెరు రోడ్డుపైన, కార్లు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్​మెంట్స పక్కన పార్కింగ్ కేటాయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి :'మా బడి.. మాకు కావాలి'.. పాఠశాల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details