గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 13 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 351కి చేరింది. నరసరావుపేటలో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 26 రోజుల వ్యవధిలోనే బాధితుల సంఖ్య 153కి పెరగడంపై ప్రజలు భయానికి గురవుతున్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న వరవకట్ట, రామిరెడ్డిపేట, ఏనుగుల బజార్, పెద్దచెరువు, పాతూరు, నిమ్మతోట ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పోలీసులు ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు.
అర్బన్‌లో తగ్గుముఖం...
గుంటూరు అర్బన్ పరిధిలో కేసుల ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇవాళ పాత కంటెయిన్మెంట్ జోన్లలో రెండు కేసులే నమోదయ్యాయి. గుంటూరు అర్బన్ పరిధిలో పక్కా ప్రణాళికతో అధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. ఇప్పటి వరకూ గుంటూరులో 150 కేసులు నమోదయ్యాయి.