ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో సింథటిక్‌ డ్రగ్స్‌.. ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు అరెస్టు - Synthetic drugs case in Guntur

గుంటూరులో సింథటిక్‌ డ్రగ్స్‌ కేసులో ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్​ చదువుతున్న ఈ ముగ్గురు విద్యార్థులు.. ఆన్‌లైన్‌ ద్వారా ఈ మత్తు మందు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు.

Synthetic drugs case in Guntur
గుంటూరులో సింథటిక్‌ డ్రగ్స్‌

By

Published : Sep 15, 2021, 2:29 AM IST

గుంటూరు శివారు గడ్డిపాడు ఇన్నర్‌రింగ్‌రోడ్డు వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో సింథటిక్‌ డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మత్తు మందు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్‌ చదువుతున్న ముగ్గురు నిందితుల నుంచి 25 ట్రమడాల్‌ మాత్రలు, 25 గ్రాముల ఎల్.ఎస్‌.డి వ్రాపర్స్‌, 7 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందులతో పాటు రూ.24,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆరెస్టు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా సమావేశంలో వివరించారు. ముగ్గురు విద్యార్థులు టెలిగ్రామ్ ఆన్‌లైన్‌ ద్వారా సింథటిక్ మత్తు మందు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details