చేపలు పట్టేందుకు వెళ్లి.. తమ్ముడు కుమారుడు వాగులో కొట్టుకుపోవటం గమనించిన పెదనాన్న.. కాపాడేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతనూ వాగులో మునిగి ప్రాణాలు విడిచాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో జరిగిందీ దుర్ఘటన.
సరదాగా చేపలు పట్టేందుకు 13 ఏళ్ల బాలుడు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు బయటకు రాలేకపోయాడు. తమ్ముడి కుమారుడు అలా వాగులో కొట్టుకుపోవడాన్ని గమనించిన పెదనాన్న... బాలుణ్ని రక్షించేందుకు యత్నించాడు. ఆయన కూడా వాగులో దూకాడు. అంతే అతను కూడా ఊబిలో ఇర్కుపోయి ఊపిరి వదిలాడు.
ఈ దుర్ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. బాలుడి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలుడి పెదనాన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.