Marijuana: గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్టు...నిందితుల్లో - marijuana
14:41 October 11
గంజాయి విక్రయిస్తూ అరెస్టైన వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు
ద్రవ రూప గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను గుంటూరులో సెబ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాముల లిక్విడ్ గంజాయి బాటిళ్లను, 50 గ్రాముల లిక్విడ్ గంజాయి కలిగిన పాలిథిన్ కవర్లను, 10 గ్రాముల చొప్పున 13 డబ్బాల్లో ప్యాకింగ్ చేసిన ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. కళాశాలల్లో కూడా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హఫీజ్ చెప్పారు. గంజాయి కేసును పట్టుకున్న పట్టాభిపురం పోలీసులను ఆయన అభినందించారు.
ఇదీ చదవండి:Marijuana: బోర్‌వెల్ లారీలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత