ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వారిద్దరు కిడ్నాపర్లు కాదు... వదంతులు నమ్మవద్దు: ఎస్పీ అమ్మిరెడ్డి

By

Published : Dec 9, 2020, 11:04 PM IST

గుంటూరు గుజ్జనగుండ్ల కూడలి వద్ద బుధవారం కిడ్నాప్ కలకలం రేగింది. దంపతులను కిడ్నాపర్లుగా భావించి స్థానికులు చితకబాదారు. అయితే పోలీసుల విచారణలో వారు కిడ్నాపర్లే కాదని తేలింది.

Guntur urban SP Ammi reddy
Guntur urban SP Ammi reddy

మీడియాతో ఎస్పీ అమ్మిరెడ్డి

భార్యాభర్తలను కిడ్నాపర్లుగా భావించి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు గుజ్జనగుండ్ల కూడలి వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో వారు కిడ్నాపర్లు కాదని తేలింది. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచర్లకు చెందిన వృద్ధ దంపతుల కుమారుడు గుంటూరులో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కుమారుడు తమను వేధించడానికి ఆ మహిళే కారణమని భావించారు ఆ భార్యభర్తలు. ఆమెపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వారివురూ బుధవారం గుంటూరులోని గుజ్జనగుండ్ల ప్రాంతంలో తిరిగారు. వృద్ధుడు సైతం బురఖా ధరించటంతో వారిని కిడ్నాపర్లుగా భావించారు స్థానికులు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.

అలాగే కొన్ని రోజులుగా పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు, అర్ధరాత్రులు గుంటూరు పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నారని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎస్పీ సూచించారు. ప్రజలు ధైర్యంగా ఉండేందుకు అన్ని ప్రాంతాలలో నైట్ బీట్​లు ఏర్పాటు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details