ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీసేవారే లేరు?' - ఏపీ స్థానిక ఎన్నికలు 2020

అమరావతి నుంచి రాజధానిని ఎందుకు మార్చాలనుకుంటున్నారో పూర్తి వివరణ ఇవ్వాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మంచివారికి ఓటు వేయాలని సూచించారు. గత బడ్జెట్‌లో కనీసం 60, 70 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీసేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

chalasani srinivas
chalasani srinivas

By

Published : Mar 11, 2020, 3:28 PM IST

మీడియాతో చలసాని శ్రీనివాస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మంచివారికే ఓటు వేయాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సూచించారు. అమరావతి నుంచి రాజధాని ఎందుకు మారుస్తున్నారో పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రాష్ట్ర నడిబొడ్డునే ఉండాలన్నారు. అలాగే బడ్జెట్ విషయంలోనూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ స్పందించాలన్నారు. గత బడ్జెట్​లో 60, 70 శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును తీసుకువెళ్లి గుజరాత్​లో పెడుతోందని మండిపడ్డారు. అహ్మదాబాద్​కు కల్పించిన సదుపాయాలు అమరావతి, అనంతపురానికి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీసేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details