Theft in Temples at Gorantla : గుంటూరు గ్రామీణ మండలం గోరంట్లలోని పలు దేవాలయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి గుడిలోకి ప్రవేశించారు. హుండీ పగలకొట్టి, నగదును దొంగిలించారు. తెల్లవారుజామున పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు.. తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆలయ నిర్వాహకులకు, నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుడిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లో ముగ్గురు దుండగులు ఆలయంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
THEFT IN TEMPLES: ఆలయాల్లో దొంగలు హల్చల్.. హుండీల్లోని నగదు అపహరణ - theft
Theft in Temples at Gorantla : గుంటూరు గోరంట్లలోని పలు ఆలయాల్లో దొంగలు హల్చల్ చేశారు. సాయిబాబా, రామాలయం, ఆంజనేయ స్వామి మందిరాల తాళాలు పగలగొట్టి, హుండీలోని నగదు అపహరించారు.
ఆలయాల్లో దొంగల హల్చల్