ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దొంగ అరెస్ట్... 177 గ్రాముల బంగారం స్వాధీనం - గుంటూరులో దొంగ అరెస్ట్ వార్తలు

పట్టపగలే చోరీకి పాల్పడుతూ నగదుతో పాటు బంగారాన్ని కాజేస్తున్న ఓ దొంగను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 177 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

theft arrested
theft arrested

By

Published : Oct 8, 2020, 10:54 PM IST

క్రికెట్ బెట్టింగ్​లకు అలవాటుపడి పట్టుపగలే చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 177గ్రాముల బంగారం, రెండు చక్రాల వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్​ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు 15వ తేదీన ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసుపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు... ఆధారాలను సేకరించారు. వేలిముద్రలతో సహాయంతో విచారణ చేపట్టిన పోలీసులు... గతంలో విజయవాడలో జరిగిన ఓ దొంగతనం కేసులో ముద్దాయి ఉన్న వ్యక్తే చేశాడని గుర్తించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయలుపాడు గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. నిందితుడిని నాగార్జున వర్శిటీ సమీపంలో అరెస్ట్ చేశారు. దొంగను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు

ABOUT THE AUTHOR

...view details