tdp rally: ధరలు దిగి రావాలంటే జగన్ దిగిపోవాలంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెదేపా శాసనసభ పక్షం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టింది. ప్రజలపై నిత్యావసరాల బాదుడు తగ్గించేలా చర్యలు చేపట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. ధరలు ఆకాశంలో, జగన్ ప్యాలస్‌లో అంటూ నినాదాలు చేశారు. చెత్త పై పన్నేసిన చెత్త సీఎం జగన్ అని ప్లకార్డుల ప్రదర్శించారు. తుగ్లక్ పాలనలో పెట్రోల్, డీజిల్ పై బాదుడే బాదుడు, షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంపు, ఇసుకను బంగారం చేశారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఓటీఎస్‌తో పేదల్ని దోచేశారని తెదేపా నేతలు విమర్శించారు.
Badude Badudu : బాదుడే బాదుడంటూ.. అసెంబ్లీ వైపు కదిలిన తెదేపా నేతలు - తుళ్లురులో తెదేపా బాదుడే బాదుడు కార్యక్రం
TDP leaders : ధరలు దిగిరావాలంటే జగన్ పోవాలంటూ.. తెదేపా నేతలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జే బ్రాండ్ పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ పాలనలో పెట్రోల్, డీజిల్‌పై బాదుడు షాక్ కొట్టేలా ఉన్నాయంటూ తెదేపా నేతలు విమర్శించారు. ప్లకార్డుల ప్రదర్శిస్తూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.
ఇంటి పన్ను పెంచి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జే బ్రాండ్స్ తో ప్రజల రక్తం తాగుతున్నారని నేతలు ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఛార్జీల బాదుడే బాదుడు అంటూ ప్లకార్డుల ప్రదర్శిస్తూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ప్రతీ కుటుంబంపై నిత్యావసరాల పెంపు భారం పడుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రాష్ట్రంలో సామాన్యులకు నిత్యావసరాల పెరుగుదల మోయలేని భారంగా ఉందని ఆక్షేపించారు. దీనిపై వాయిదా తీర్మానం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ, ఇంధన ధరలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కంటే జేబు దొంగలే నయమని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ దుయ్యబట్టారు. జేబు దొంగలు పర్సులు మాత్రమే కొట్టేస్తారని, జగన్ మాత్రం రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: