డీజే సాంగ్స్‌తో దద్ధరిల్లిన ఏఎన్‌యూ - డీజే సాంగ్స్‌తో దద్ధరిల్లిన ఏఎన్‌యూ
ఏఎన్‌యూలో నాసా జోన్5 సమ్మేళనం చివరిరోజు ఉత్సాహంగా సాగింది. యువత నిర్వహించిన ప్లాష్ మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![డీజే సాంగ్స్‌తో దద్ధరిల్లిన ఏఎన్‌యూ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4694062-989-4694062-1570565743599.jpg)
ఫ్లాష్‌మాబ్
విద్యార్థుల ఫ్లాష్‌మాబ్
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నాసా జోన్5 సమ్మేళనం మంగళవారంతో ముగిసింది. చివరి రోజు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. నాసా జోన్ 5 సమ్మేళనానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవాలోని ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డీజే సౌండ్లతో విద్యార్థులు కదం తొక్కారు. ముగింపు సమావేశానికి ఏఎన్‌యూ ఇంఛార్జ్ వీసీ ఆచార్య రామ్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.