గుంటూరు నగరంలో చాలాచోట్ల రహదారులు పాడైపోయి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 10 రోజుల క్రితం గుంటూరులో పర్యటించిన సమయంలో గుంతలు పూడ్చాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు హుటాహుటిన రహదారులు మరమ్మతులు చేపట్టారు. అయితే దీని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన తారు మిశ్రమాన్ని ఉపయోగిస్తుండటం విశేషం. హిన్ కాల్ రోడ్ పాండ్ పేరుతో పిలిచే ఈ మిశ్రమాన్ని రోడ్లపై ఉండే చిన్నచిన్న గుంతలను సులువుగా పూడ్చేందుకు వినియోగిస్తున్నారు. ఈ మిక్సర్ను గుంతలో వేయగానే సెట్ అవుతుందని... హెపీసీఎల్ సంస్థ ద్వారా చెన్నై నుంచి దీనిని తెప్పించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. గుంటూరు పోలీసుల కవాతు మైదానంలో నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పాల్గొన్నారు.
సీఎం రాకతో... వాహనదారులకు తీరిన ఇక్కట్లు - గుంటూరులో రోడ్లకు మరమ్మతులు
గుంటూరు జిల్లాలో రహదారుల గుంతలకు ముఖ్యమంత్రి పర్యటనతో మోక్షం లభించింది. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని అధికారులు హుటాహుటిన చేపట్టారు. గుంతలు త్వరగా పూడ్చేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన తారు మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు.
గుంటూరు