ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చర్చిలో పదోన్నతి కల్పించలేదని.. కుటుంబంతో పాస్టర్ నిరసన - పాస్టర్

గుంటూరు లాడ్జిసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ పాస్టర్ అతని కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. 24 ఏళ్లుగా ఏ.ఈ.ఎల్.సి చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న తనకు పదోన్నతి కల్పించకుండా.. అర్హత లేనివారికి పదోన్నతులు కల్పిస్తున్నారని అతను ఆరోపించాడు.

పాస్టర్
పాస్టర్

By

Published : Oct 28, 2021, 10:36 PM IST

గుంటూరు లాడ్జిసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాస్టర్ అతని కుటుంబ సభ్యులు నిరసన దీక్షకు దిగారు. గత 24 ఏళ్లుగా ఏ.ఈ.ఎల్.సి చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న తనకు పదోన్నతి కల్పించకుండా.. అర్హత లేనివారికి పదోన్నతులు కల్పిస్తున్నారని ఏ.ఈ.ఎల్.సి చర్చ్ పాస్టర్ నవకుమార్ ఆరోపించారు. తనకు తక్షణమే గుంటూరు పశ్చిమ ప్యారిస్ చర్చ్ పాస్టర్ గా పదోన్నతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కుటుంబ సభ్యులు తో కలసి ఆత్మహత్య చేసుకుంటానాని చెప్పారు.

ఏ.ఈ.ఎల్.సి ప్రెసిడెంట్ పరదేశీ బాబు, ఏలీయా ఇద్దరు తనకు పదోన్నతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో కుటుంబ సభ్యులతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. దాదాపు రెండు గంటల తరువాత ఏ.ఈ.ఎల్.సి ప్రెసిడెంట్ పరదేశీ బాబు వారిని తన కార్యాలయానికి పిలిపించారు. సంఘ సభ్యులు తో చర్చించి రేపు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు బాధితుడు చెప్పాడు. దాంతో పాస్టర్ నిరసన విరమించాడు.


ఇదీ చదవండి:ఆ డెయిరీ కోసం మేమెందుకు ప్రచారం చేయాలి: పశువైద్యులు

ABOUT THE AUTHOR

...view details