శనివారం రాత్రి కురిసిన వర్షానికి గుంటూరు జిల్లా బాపట్ల నందిరాజుతోటలోని ఓ కోళ్ల ఫారంలో విద్యుదాఘాతం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కోళ్లన్నీ సజీవ దహనమయ్యాయి. కోళ్ల విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని కోళ్ల ఫారం యజమాని కొల్లూరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు సైతం కాలి బూడిదైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
కోళ్ల ఫారంలో షార్ట్ సర్క్యూట్..రూ.7 లక్షల విలువైన కోళ్లు మృతి - వర్షాలకు విద్యుత్ షాక్
విద్యుదాఘాతంతో కోళ్ల ఫారంలోని కోళ్లన్నీ కాలిబూడదై పోయాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది.
కోళ్లన్నీ బూడిద