జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని శ్రీ మహాత్మాగాంధీ సేవ శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఆధ్వర్యంలో రచించిన ''బాపు నీ బాటలో'' అనే పుస్తకాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహాత్ముని భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
తెనాలిలో 'బాపు నీ బాటలో' పుస్తకావిష్కరణ - గుంటూరు జిల్లా వార్తలు
మహాత్ముని జయంతి సందర్భంగా...తెనాలిలో 'బాపు నీ బాటలో' పుస్కకావిష్కరణ కార్యక్రమం జరిగింది. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు.
తెనాలిలో 'బాపు నీ బాటలో' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే