ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వాలు చేయూతనివ్వకుంటే వస్త్రరంగం కోలుకోవడం కష్టమే' - textile industry losses in guntur

లాక్​డౌన్​ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్​లో కరోనా కారణంగా తాము పూర్తిగా నష్టపోయామని వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులపై వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

'ప్రభుత్వాలు చేయూతనివ్వకుంటే వస్త్రరంగం కోలుకోవడం కష్టమే'
'ప్రభుత్వాలు చేయూతనివ్వకుంటే వస్త్రరంగం కోలుకోవడం కష్టమే'

By

Published : Apr 28, 2020, 1:35 PM IST

లాక్​డౌన్​ వల్ల వస్త్ర పరిశ్రమ కుదేలు

లాక్​డౌన్​ వల్ల వస్త్ర పరిశ్రమ కుదేలయ్యింది. నిత్యావసరాల జాబితాలో లేకపోవటంతో వస్త్ర దుకాణాలు ఇప్పట్లో తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు దుకాణాల్లో సరుకు మూలుగుతుంటే.. మరోవైపు తెచ్చిన అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి జీతభత్యాల సంగతి అటుంచితే... కనీసం అద్దెలు కట్టే పరిస్థితి కూడా లేదంటున్నారు. బ్యాంకు వాయిదాలు సైతం చెల్లించడం చిరు వ్యాపారులకు కష్టసాధ్యంగా మారిందని వాపోయారు. గుంటూరులో వస్త్ర రంగంలో నెలకొన్న సంక్షోభంపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!

ABOUT THE AUTHOR

...view details