ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మిద్దెతోటల పెంపకం... సమస్యల పరిష్కారానికి వేదికగా సామాజిక మాధ్యమం

స్నేహితులు, కుటుంబసభ్యులు, సహొద్యోగులు... ఇలా ఎవరికి వారు వాట్సప్ గ్రూపులు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ గుంటూరు జిల్లాలో మిద్దెతోటలు సాగుచేస్తున్న ఔత్సాహికులు కూడా ఓ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో మిద్దెతోటలు సాగు చేస్తున్న వారిని అందులో సభ్యులుగా చేర్చారు. ఇంటిపై వివిధ రకాల కూరగాయలు, పూలు, పండ్లు సాగు గురించి సలహాలు, సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

By

Published : Aug 26, 2021, 4:44 PM IST

మిద్దెతోటల పెంపకం
మిద్దెతోటల పెంపకం

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజలకు అవగాహన కలుగుతోంది. రసాయనాలు, పురుగులమందులు ఉపయోగించి పండిస్తున్న పంటలతో ఆరోగ్యం దెబ్బతింటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు ఔత్సాహికులు స్వంతంగా పంట పండిస్తున్నారు. స్థలం లేని వారు ఇంటిపైనే మిద్దెతోటను పెంచుకుంటున్నారు. ఈ మిద్దెసాగులో నిర్వాహకులకు ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా... ప్రముఖ సామాజికమాధ్యమం వాట్సాప్​ను వేదికగా ఎంచుకున్నారు గుంటూరు నగరానికి చెందిన మిద్దెసాగు నిర్వహకులు.

ఈ బృందంలో సభ్యులకు ఉత్పన్నమయ్యే సందేహాలను తీర్చేందుకు... మిద్దెతోటలపై సంపూర్ణ అవగాహన ఉన్న నిపుణులను చేర్చారు. సభ్యులు అడిగిన సమస్యలకు గ్రూప్​లోనే సమాధానం లభించేలా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా మిద్దెసాగు అభివృద్ధికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. వారాంతాల్లో మిద్దెతోటల్ని సందర్శించి, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ విధానంలో సాగు చేసిన వారు... తాము పొందిన ఫలితాలను గ్రూప్​లో పెడుతుంటారు. గ్రూప్ ద్వారా వ్యాపారం చేయకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ గ్రూప్​ను ఏర్పాటు చేసినట్లు గ్రూప్ అడ్మిన్ తెలిపారు. పది మందితో మొదలైన గ్రూప్​లో ప్రస్తుతం 220 మందికి పైగా సభ్యులు ఉన్నారు.

ఇవీచదవండి.

Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

పోలవరం పునరావాస కాలనీలలో మౌలిక వసతులు కరవు

ABOUT THE AUTHOR

...view details