అమ్మవారి రూపాన్ని ఇసుక ద్వారా చిత్రించి.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ కళాకారుడు భక్తిని చాటుకున్నాడు. ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్.. వివిధ రూపాల్లో చిత్రాలు గీయగలడు. దసరా సందర్భంగా ఇప్పుడు దుర్గమ్మను గీశాడు.
పారదర్శకంగా ఉండే గ్లాసుపై ఇసుకను చల్లి.. చిత్రాలు గీయడం శ్రీనివాస్ ప్రత్యేకత. పలు సందర్భాల్లో ఇప్పటికే తన ప్రతిభను బయటపెట్టాడు. అతడి కళను చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు.