ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ ఓట్లు చీలికతోనే తెలుగుదేశం పార్టీ పరాజయం' - telugudesam

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు, మాదిగ సామాజికవర్గాలు ఈసారి ఎన్నికల్లో చెల్లాచెదురు కావడంపై పొలిట్‌బ్యూరో సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ఇతర సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్లే ఈ రెండు సామాజికవర్గాల ఓట్లలో చీలిక వచ్చిందనే అభిప్రాయానికి నేతలు వచ్చారు.

'ఆ ఓట్లు చీలికతోనే తెలుగుదేశం పార్టీ పరాజయం'

By

Published : Aug 9, 2019, 2:46 PM IST

గుంటూరులోని రాష్ట్ర పార్టీకార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశంలో 12 అంశాలపై లోతుగా చర్చించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణలో బీసీ, మాదిగ సామాజికవర్గాలను తిరిగి తెలుగుదేశానికి దగ్గరచేసుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడం, తెలుగుదేశంనేతలపై దాడులు, భద్రత తొలగింపు, రైతు ఆత్మహత్యలు వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి నివాసం, జమ్ముకశ్మీర్‌ మినహా దేశంలో మరెక్కడా 144సెక్షను అమలుకావడంలేదని తెదేపా మండిపడింది. గోదావరి నదీజలాల వినియోగం, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అంతర్గతంగా జరిగే అవగాహని ఒప్పందం కారాదని స్పష్టంచేసింది. పేదల ఉసురు పోసుకుని వారి పొట్టకొట్టేందుకే జగన్ సీఎం అయ్యారని పొలిట్‌బ్యూరో సభ్యులు విమర్శించారు. 370, 35ఏ ఆర్టికల్ రద్దును తెదేపా పొలిట్ బ్యూరో స్వాగతించింది. భవిష్యత్తులో దేశ ప్రయోజనాల కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెదేపా మద్దతుపలుకుతుందని స్పష్టంచేసింది.

ABOUT THE AUTHOR

...view details