ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాటర్ ట్యాంకర్​ను లిక్కర్ ట్యాంకర్​గా మార్చేశారు - taja news of telangana liquor

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. సీజ్ చేసిన సరకు విలువ రూ.21లక్షలు ఉంటుందని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.

telangana liquor caught in guntur dst
telangana liquor caught in guntur dst

By

Published : Sep 5, 2020, 6:37 PM IST

గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు వద్ద అమరావతి పోలీసులు పెద్దఎత్తున అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. వాటర్ ట్యాంకర్​లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న 9,100 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసి పోలీసులు మద్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 21లక్షలు ఉంటుందని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details