ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అగ్రిగోల్డ్ తీర్పుపై సీపీఐ నేతల హర్షం - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు

అగ్రిగోల్డ్ బాధితులకు నగదు తిరిగి చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రూ.20 వేలు డిపాజిట్లు చేసిన వారికి నగదు తిరిగి ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సీపీఐ నేతలు కోరారు. సీపీఐ ఉద్యమ ఫలితంగా డిపాజిటర్లకు మేలు జరుగుతోందన్నారు.

agrigold
agrigold

By

Published : Nov 10, 2020, 4:04 PM IST

ఇరవై వేల రూపాయల డిపాజిట్లు చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు మార్చిలోపు నగదు తిరిగి చెల్లించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులోని.. సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

సీపీఐ ఉద్యమ ఫలితంగా డిపాజిటర్లకు మేలు జరుగుతోందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్.. వచ్చే మార్చిలోపు బాధితులందరికీ డబ్బులు తిరిగి చెల్లించి మాట నిలబెట్టుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details