ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోలాహలంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు - Teachers MLC Nominations latest news

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నామినేషన్లు గుంటూరు కలెక్టరేట్​లో కోలాహలంగా సాగింది. మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Teachers MLC Nominations in Guntur Collectorate
గుంటూరు కలెక్టరేట్​లో కోలాహలంగా నామినేషన్లు

By

Published : Feb 22, 2021, 5:01 PM IST

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నామినేషన్లు గుంటూరు కలెక్టరేట్​లో కోలాహలంగా సాగింది. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

వైకాపా మద్ధతుదారుగా కల్పలతారెడ్డి, తెదేపా బలపరచిన అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, భాజపా తరపున అభ్యర్ధిగా విజయవాడకు చెందిన కోట సాయికృష్ణ, సీపీఐ మద్ధతుదారుగా మల్లికార్జునరావు, ఏపీటీఎఫ్‌ తరపున పాండురంగారావు నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఎస్, పీఆర్‌సీ సమస్యలతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తామని.. తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధులు కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details