ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా రోగులకు కేర్​ టేకర్లుగా ఉపాధ్యాయులు

కొవిడ్ విజృంభిస్తోన్న వేళ...ఉపాధ్యాయులకు గుంటూరు అధికారులు గురుతర బాధ్యతలు అప్పగించారు. హోం ఐసోలోషన్​లో ఉన్న రోగులకు కేర్ టేకర్లుగా నియమించారు. ఫోన్ ద్వారా రోగుల బాగోగులు తెలుసుకుని జిల్లా యంత్రాంగానికి నివేదికలను అందజేయాలని సూచించారు.

Teachers as caretakers for corona patients at guntur
కరోనా రోగులకు కేర్​ టేకర్లుగా ఉపాధ్యాయులు

By

Published : May 9, 2021, 4:54 AM IST

కరోనా సోకిన వారిలో 80 శాతం మంది హోం ఐసోలేషన్​లోనే గడుపుతున్నారు. చాలామంది ఇంట్లోనే ఉంటూ మందులు, పోషకాహారం తీసుకుంటూ కోలుకుంటున్నారు. కొవిడ్ వైరస్ వ్యాప్తిని నివారణ, నియంత్రణలో వీరి పాత్ర కీలకం. పెద్దఎత్తున కేసులు వెలుగుచూస్తున్న వేళ హోం ఐసోలేషన్​లో ఉన్నవారిని గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో హోం ఐసోలేషన్ ప్రక్రియ బలోపేతానికి....బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఉపాధ్యాయులకు కేర్ టేకర్లుగా బాధ్యతలను అప్పగించింది. ఒక్కో ఉపాధ్యాయుడికి ఒక్కో బాధితుడిని కేటాయించారు. వీరి ఫోన్ నంబర్ల ఆధారంగా 14 రోజుల పాటు నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని వీరు తెలుసుకుంటూ గూగుల్ షీట్ ద్వారా పరిస్థితిని జిల్లా యంత్రాంగానికి చేరవేయాలి.

రోగులకు ఏఎన్​ఎం అందుబాటులో ఉన్నారా ? మందులు, ఆహారం, వేడి నీళ్లు తాగుతున్నారా ? ఇంకా ఆరోగ్య సమస్యలున్నాయా ? అనే విషయాలను సేకరించే బాధ్యతను ఉపాధ్యాయుల భుజాలపై పెట్టారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి, కిట్ పంపిణీ జరిగిందా ? లేదా అనే అంశాలను ఫోన్ ద్వారానే సేకరించాలి. ఆరోగ్య సమస్యలు తీవ్రమైతే 104 కాల్ సెంటర్​కు, అవసరమైతే కలెక్టర్​కు సమాచారాన్ని చేరేవేసేలా సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ఆపద కాలంలో ఈ బాధ్యతలను స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు...తమను ఫ్రంట్ లైన్వారియర్స్​గా గుర్తించాలని.. ప్రత్యామ్నాయ విధానాలను, సిబ్బందిని పరిశీలించాలని కోరుతున్నారు.

హోం ఐసోలేషన్​ ఉన్నవారికి ఉపాధ్యాయులను కేర్ టేకర్లుగా నియమించడం వల్ల…బాధితులకు భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కచ్చితమైన లెక్క, ముందస్తు ప్రణాళికకు అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.

కరోనా రోగులకు కేర్​ టేకర్లుగా ఉపాధ్యాయులు

ఇదీచదవండి

క‌రోనా కాటుకు ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details