గుంటూరు జిల్లా అడిగొప్పులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు... వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కుల్ని హరించే విధంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉండే పల్నాడులో రౌడీయిజం పెరిగిపోయిందని ఆక్షేపించారు. రెండున్నరేళ్లలో 29మంది తెదేపా కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు. తాను చేసిందే చట్టం, తాను చెప్పిందే రాజ్యాంగం అన్న విధంగా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించకుండా గూండాయిజాన్ని చెలాయిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
Atchannaidu: 'వైకాపా అధికారంలోకి వచ్చాక పల్నాడులో రౌడీయిజం పెరిగింది'
ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కుల్ని హరించే విధంగా ముఖ్యమంత్రి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా అడిగొప్పులలో పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు