Yedlapati Venkatrao: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు లాంటి వ్యక్తుల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి వారి మృతికి సంతాపం తెలపాల్సిన అవసరం ఉందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వానికి సూచించారు. వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యక్తుల కోసం పార్టీలకతీతంగా పోరాడాలని తెలిపారు.
రోశయ్య, యడ్లపాటి వెంకట్రావు.. వ్యక్తిగత విమర్శలకు పోకుండా పరిపూర్ణమైన రాజకీయాలు చేసిన వ్యక్తులని కొనియాడారు. ప్రస్తుతమున్న రాజకీయాలను ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ విధానాలన్నీ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తమపై ఇప్పటికే తొమ్మిది కేసులు ఉన్నాయని.. దానిలో అత్యాచారం కేసు కూడా ఉండటం బాధాకరమని అయ్యన్నపాత్రుడు అన్నారు.
Yedlapati Venkatrao: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు ఆత్మీయ సంస్మరణ సభ గుంటూరు జిల్లా తెనాలి ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. యడ్లపాటి వెంకట్రావు ఆత్మీయులు, సన్నిహితులు.. విరివిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి. రవిచంద్ర, వెంకటేశ్వరరావులు రూపొందించిన విగ్రహాన్ని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.