మీడియాపై దాడి కేసులో మందడం, వెలగపూడి, మల్కాపురం గ్రామాలకు చెందిన మొత్తం 16మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. 10మందిని చిలకలూరిపేట, ఆరుగురిని తెనాలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మాట్లాడదామని పిలిచి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెనాలి పోలీస్ స్టేషన్లో ఉన్న బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులను ఇలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా విలేకరికి ఇస్తున్న ప్రాధాన్యత.... రాజధాని కోసం 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్న మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.