ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Duggirala MPP: దుగ్గిరాలలో ఉత్కంఠ... గృహ నిర్బంధంలో తెదేపా నేతలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ(duggirala MPP) తెదేపా అభ్యర్థి షేక్ జబీన్​(Zabeen)కు కులధ్రువీకరణ పత్రం(cast certificate) ఇవ్వకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్న తనను అరెస్టు చేశారని పార్టీ నేత సయ్యద్ రఫీ(sayyad rafi) మండిపడ్డారు. అధికారులు స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.

దుగ్గిరాలలో కొనసాగుతున్న ఉత్కంఠ
దుగ్గిరాలలో కొనసాగుతున్న ఉత్కంఠ

By

Published : Oct 4, 2021, 9:11 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ తెదేపా అభ్యర్థి షేక్ జబీన్(zabeen)​కు కులధ్రువీకరణ పత్రం(cast certificate) ఇప్పించేందుకు తాను కృషి చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ(sayyad rafi) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి రఘురామరాజుతో కలిసి వెళ్తున్న తనను పోలీసులు గృహనిర్భందం చేశారని మండిపడ్డారు. షేక్ జబీన్​కు జరుగుతున్న అన్యాయంపై స్పందనలో ఫిర్యాదు చేస్తామన్న కారణంతో పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కులధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా జాప్యం(delay) చేయడంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా, న్యాయవాది కృష్ణారెడ్డిలు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు.

నేతల ఆందోళన...

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు ఎంపీటీసీగా(chiluvuru MPTC) ఎన్నికైన అభ్యర్ధికి కుల ధ్రువీకరణ పత్రాన్ని తక్షణమే మంజూరు చేయాలని తెదేపా నేతలు డిమాండ్(demand) చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్(guntur ) వద్ద ఆందోళన(protest) నిర్వహించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. మండలంలో ఎంపీపీ పదవిని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకోనుందని.. కానీ తెదేపా అభ్యర్ధికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కులధ్రువీకరణ పత్రం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. అధికారులు స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.

ఇదీ జరిగింది...

దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా 9, వైకాపా 8, జనసేన 1స్థానాలు గెలుపొందాయి. అత్యధిక స్థానాలు గెలిచిన తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కే అవకాశముండటంతో చిలువూరు నుంచి గెలిచిన జబీన్​ను ఎంపీపీ అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. ఈ క్రమంలో జబీన్​కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. మరోవైపు సెప్టెంబర్ 24న జరిగిన ఎంపీపీ ఎన్నికకు తెదేపా(TDP), జనసేన(janasena) సభ్యులు గైర్హాజరయ్యారు. కోరం(coram) లేని కారణంగా సమావేశం వాయిదా పడింది. దీంతో 25వ తేదీన మళ్లీ సమావేశం(meeting) నిర్వహించినా అదే పరిస్థితి ఏర్పడింది.

వీడని ఉత్కంఠ..

తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కకుండా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(MLA alla ramakrishnareddy) అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ముస్లిం మైనార్టీ మహిళకు పదవి రాకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈనెల 8న ఎంపీపీ ఎన్నిక(MPP election) నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మరోసారి జబీన్ కుల ధ్రువీకరణ పత్రం కోసం దుగ్గిరాల తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. తహశీల్దార్​పై తెదేపా నేతలు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో... జబీన్ కుల ధ్రువీకరణ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెనాలి సబ్ కలెక్టర్​ను జిల్లా అధికారులు ఆదేశించారు. సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా జబీన్ కు కులధ్రువీకరణ పత్రం వస్తుందా..? లేదా..? అనేది తేలనుంది.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details